Aadhyathmika Kendra Chennai
One stop solution for Divine Products

Aadhyathmik Om Mani Padme Hum Mandala Raksha Dharma Chakra Hand Mane Tiny for Peaceful Life 1inch 2 grams White Metal Pendant – S9058-127

555

2 in stock

Description

 

Very Tiny Piece Weighing Only 2 Grams

Please expect natural variations.

The images signify actual product however color of the image and product may slightly differ.

ఓం మని పద్మే హుం మండల రక్ష

ఓం మని పద్మే హుం మండల రక్ష అంటే దుష్టశక్తులకు భయం. కనుక ఓం మని పద్మే హుం మండల రక్షను చేతి వేళ్ళతో తిప్పడం ద్వారా సర్వ దుష్టశక్తులు ఆ ప్రాంతం నుండి పారిపోతాయి. కనుక ఓం మని పద్మే హుం మండల రక్షను తిప్పడం ద్వారా ప్రశాంతత, మనశ్శాంతి లభిస్తుంది.

ఓం అన్నది ప్రణవాక్షరం అనే విషయం మనందరికీ తెలిసినదే. ఆ ప్రణవాక్షరం నుండే సర్వాక్షరాలు ఉద్భవించాయి. కనుక ఓం మని పద్మే హుం మండల రక్షను తిప్పడం ద్వారా మంచి జ్ఞానం కలుగుతుంది. విద్యార్థులకు వరం. అలాగే మంచి తెలివితేటలు ఉంటేనే చేసే వృత్తి లేక వ్యాపారమందు అభివృద్ధి సాధించగలుగుతారు. కనుక ఏ ఉద్యోగం లేక వ్యాపారం చేసేవారైనా సరే ఈ కవచధారణ అనివార్యం.

మని అంటే వెలకట్టలేని ఆభరణం అని అర్థం. అయితే మ అనే శబ్దానికి అసూయ, కామం,

వినోదం అనే అర్థాలున్నాయి. అలాగే ని అనే శబ్దానికి అభిరుచి, కోరిక అనే అర్థాలున్నాయి. మానవుడు ఎప్పుడు కోరికలను జయిస్తాడో అతడు వెలకట్టలేని ఆభరణంతో సమానమని అర్థం. కనుక ఎవరు ఓం మని పద్మే హుం మండల రక్షను తిప్పుతుంటారో వారు అతి త్వరలో ఉన్నత స్థాయిని అధిరోహిస్తారు. సమజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

పద్మే అంటే లక్ష్మిదేవి అని అర్థం. సర్వ దరిద్రాలను పారద్రోలుతుంది. పద్, పె అనే శబ్దానికి మూర్ఖత్వం, దురభిప్రాయం అని అర్థాలున్నాయి. మే అనే శబ్దానికి పేదరికం అని అర్థముంది. అంటే ఎవరు ఓం మని పద్మే హుం మండల రక్షను తిప్పుతుంటారో వారు పేదరికం, దరిద్రం నుండి బయటపడుతారు.

హుం అంటే ద్వేషం, దూకుడు అని అర్థాలున్నాయి. అంటే ఎవరు ఓం మని పద్మే హుం మండల రక్షను తిప్పుతారో వారు అనర్థాల వలన జీవితమును నరకం చేసుకోకుండా ఏది నిజం ఏది మాయ అనే విషయజ్ఞానం కలిగి తమ జీవితాన్ని స్వర్గమయం చేసుకుని తమతో జీవించేవారిని ఆనందంగా గడిపే విధంగా చేసుకుంటారు.

ఓం మని పద్మే హుం మండల రక్షను తిప్పేటప్పుడు పఠించవలసిన మంత్రం “ఓం మని పద్మే హుం”

-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి