Aadhyathmika Kendra Chennai
One stop solution for Divine Products
Sale!

Aadhyathmik Parasuvu Raksha Brass Pendant 1inch 7grams To become Brave, Victory over Enemies, Protection Talisman To Adventure around the World – S9058-129

555

Out of stock

Description

 

Aadhyathmik Parasuvu Raksha White Metal Pendant 1inch 7grams To become Brave, Victory over Enemies, Protection Talisman To Adventure around the World

పరశువు రక్ష

విష్ణుమూర్తి శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగింది. పరశురాముడి ఘోరతపస్సుకు మెచ్చి మహాశివుడు పరశురాముడికి ఖగోళ గొడ్డలిని కానుకగా ఇస్తాడు. గొడ్డలికి పరశువు అని మరో పేరు. కనుక ఆ పేరు ఆయనకు సార్థకమైంది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. రాజ్యంలోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్రూరులైన క్షత్రియుల నుంచి ప్రజలకు విముక్తిని కలిగించడానికి పరశురాముడి అవతారంలో శ్రీ మహావిష్ణువు జన్మించాడు. తద్వారా ధర్మాన్ని, కర్మని నిర్లక్ష్యం చేస్తున్న కఠినమైన క్షత్రియుల అంతు చూసాడు. పరశురాముడికి మరణం లేదు. ఇప్పటికీ భూమిపైన తిరుగుతున్నాడు. కల్కీ అవతారం ఉద్భవించినప్పుడు భువిపైకి వచ్చి అతనికి గురువుగా వ్యవహరిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసుకోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరి సముద్రుణ్ని ప్రార్థించి తన పరశువు ఎంత పరిమాణంలో ఉందో అంత పరిమాణంలో భూమిని తిరిగి ఇవ్వాలని కోరగా సాక్షాత్తు మహావిష్ణువు ప్రతిరూపమైన పరశురాముడు కోరడంతో సముద్రుడు తనలో ఉన్న భూమిని నీటిపైకి తీసుకొస్తాడు. ఆ ప్రదేశమే భూలోక స్వర్గం. అదే ప్రస్తుత కేరళ రాష్ట్రమని పురాణాలలో ఆధారాలున్నాయి. కేరళ రాష్ట్రం గొడ్డలి ఆకారంలోనే ఉంటుంది.

చెప్పిన మంచి మాటలేవి విననివారెవరికైన ఈ రక్షను ధరింపజేస్తే వారు తప్పక దారిలోకి వస్తారు.

ప్రతి విషయానికి భయపడేవారి కంఠమందు ఈ రక్షను ధరింపజేస్తే వారు ధైర్యవంతులౌతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహసం చేసేవారు తప్పక ఈ రక్షను ధరించి తీరాల్సిందే. ఈ రక్షను ధరించేవారికి ప్రపంచాన్ని జయించగల శక్తి కలుగుతుంది. జీవితాశయం నెరవేరుతుంది.

ఉన్నదానికి లేనిదానికి తరచు అబద్ధాలు ఆడేవారి కంఠమందు ఈ రక్షను ధరింపజేయిస్తే వారు క్రమంగా అబద్ధాలు చెప్పడం మానుకుంటారు. వివేకవంతులౌతారు.

ఈ రక్షను ఎవరు ధరిస్తారో వారి ఇల్లు స్వర్గంగా మారుతుంది. అది పూరిగుడిసె అయినా పెద్ద భవంతి అయినా సరే ఆ ఇంట ప్రశాంతత నెలకొంటుంది. ఇది ముమ్మాటికి సత్యం.

పఠించాల్సిన మంత్రం :- ఓం  పరశురామ పూజితాయ నమః

– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి