Description
కమలాత్మిక కవచం
దశమహావిద్యలలో పదవ మహావిద్య శ్రీ కమలాత్మిక దేవి. సకలైశ్వర్య ప్రదాయిని అయిన ఈ కమలాత్మిక శాంతి స్వరూపిణి. లక్ష్మీ స్వరూపిణి అయిన ఈ మహావిద్య కవచాన్ని ధరిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని ఈ కమలాత్మిక దేవి ప్రసాదిస్తుంది.
ఈ కవచాన్ని ఆడ మగ బేధం లేకుండా చిన్న వయస్సువారి నుండి ముసలివారి వరకు ఎవరైనా ధరించవచ్చు. ఏ రాశివారైనా ఏ నక్షత్రజాతకులైనా ధరించవచ్చు. ముఖ్యంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలవారు అమ్మవారి ఆధీనంలో ఉంటారు. కనుక ఈ నక్షత్రాలలో జన్మించినవారు తప్పక కమలాత్మిక కవచాన్ని ధరించడం శుభదాయకం.
కమలాత్మిక దేవి శుక్రగ్రహ దోషాలను శాంతింపజేస్తుంది. కనుక సంతానం విషయంలో ఆలస్యమౌతున్నవారు కమలాత్మిక కవచాన్ని ధరించినా, తమ వద్ద పాకెట్లో / లేడీస్ హ్యాండ్ బ్యాగులో ఉంచుకున్నా, ఇంట్లో దేవునిగృహంలో ఉంచుకున్నా శుభం.
కమలాత్మిక తత్త్వం ఆనందం, సౌందర్యాన్ని సూచిస్తుంది. అన్మమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములలోగల సర్వదేవతల యొక్క మూర్తి తత్త్వమునకు మూలమైన ఆత్మ స్వరూపం కమలాత్మిక.
పఠించాల్సిన మంత్రం :- “ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్నైచ ధీమహీ తన్నో లక్ష్మీః ప్రచోదయాత్”
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి