Aadhyathmika Kendra Chennai
One stop solution for Divine Products
Sale!

Aadhyathmik Baktha Anjaneya Raksha Kavach Roopu Locket Mixed Metal Pendant 1.5inch 6grams – S9058-57

525

Description

 

భక్తాంజనేయ రక్ష

భక్తాంజనేయ రక్షను ధరించి 9 శనివారాలు భజ్రంగబలి ఆలయదర్శనం చేసుకుని స్వామికి 108 తమలపాకులతో మాల కట్టి అలంకరింపజేస్తే సకల సంపదలు కలుగుతాయన్నది వేదోక్తి.

భక్తాంజనేయ రక్షధారణ చేసి స్వామికి వడమాల అలంకరింపజేసి అనంతరం ఆ వడమాలలోని వడలను భక్తులకు పంచిపెట్టడంవలన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

సీతమ్మవారి పాపిట సింధూరం ధరించడంలోని పరమార్థం ఏమిటని హనుమ కోరగా అప్పుడు సీతాదేవి “నాయనా హనుమా, స్వామివారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించాను” అని చెప్పగా హనుమ తన శరీరమంతా సింధూరాన్ని అలంకరించుకుని “సీతమ్మవారు పాపిట సింధూరం ధరిస్తేనే మీకు ఇంత సౌభాగ్యం కలిగిందంటే ఇక నేను శరీరమంతా సింధూరాన్ని ధరించాను కనుక మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో గదా!” అని ఆనందంగా చెప్పాడు. హనుమ భక్తికి మెచ్చిన శ్రీరాములవారు “ఆంజనేయా, నీవంటి భక్తుడు ఈ పధ్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించినవారికి మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయి” అని వరదానం చేశాడు. కనుక ఎవరైతే భక్తాంజనేయ రక్షధారణ చేసి నుదట నిత్య సింధూరధారణ చేస్తారో వారి ఆనందానికి అదుపులుండవు, ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి.

భక్తాంజనేయ రక్షధారణచేసి ఒకటే పూట భోజనం చేసి 41 వారాల పాటు మంగళవారం రోజు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో స్వామిపై మనస్సును కేంద్రీకరించి పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. సర్వ గ్రహ భాదలు తోలగి ధైర్యం చేకూరుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఐశ్వర్యం, సమాజంలో గౌరవం, సంతానం కలుగుతుంది. ఈతి బాధలుండవు. మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది, ఉపాధి అవకాశాలు చేకూరుతాయి, ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు, లక్ష్యాలను చేరుకోవడం వంటి శుభఫలితాలుంటాయి.

భక్తాంజనేయ రక్షధారణ సమయంలో ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠించాలి.

– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి