Aadhyathmika Kendra Chennai
One stop solution for Divine Products
Sale!

Aadhyathmik Panchayatan Set of 5 Sacred Shilas Called 5S’s Namely SonabhadraSona Swarnamukhi SalagramGandhaki SphatikVallam ShivlingBanalingNarmadeeswar Small Compact around 20mm with Total Weight 28grams – S9073-06

5,255

Out of stock

Description

 

Panchayatana puja is the system of worship which was most common in every house till few decades ago.

The Panchayatana is a system which consists of

the worship of five deities:

“Adityam Ambikaam Vishnum Gananaatam Maheswaram”

Aditya is Surya; Ambika is Devi; Vishnu is

Narayana; Gananaatham is Ganesha, Mahesvara is shiva.

These five are the great divine force whom every householder worships as pancha devata puja.

Based on the tradition

followed by the family, one of these deities is kept in the center and the other four surround it and worship is offered to all the deities.

The panchayatana scheme represent the five elements:

AkAshasyAdhipo viShNuH agneshchaiva maheshvarI |

vAyoH sUryaH kShiterIshaH jIvanasya gaNAdhipaH ||

Akasha :  Space  : Vishnu

Vahni :  Fire  : AmbikA

Vayu  :  Air  : Aditya

kShiti :  Earth : Shiva

Jala  :  Water : Ganapati

All the five deities are not Panchaloka or any other metal idols; But these five are represented by small natural stones found in various parts of Bharatha Desham.

            Deity                Stone   River               Place

Jala  :  Water   Ganesha         Red Sonabhadra                     Sone                Bihar

Vayu  :  Air      Surya              Crystal                         Vallam             Tamil Nadu (Tanjavur)

Akasha Space            Vishnu     Saligrama                            Gandaki          Nepal

kShiti :  Earth Shiva               Bana Linga                  Narmada         Madhya Pradesh

Vahni :  Fire     Ambika    Swarna Mukhi        Swarnamukhi              Andra Pradesh

The image of that particular devata is kept in the centre, surrounded by the other gods.

If he is a devotee of Vishnu, he places the idol of Vishnu in the centre with the other idols surrounding it. If he is a devotee of Lord shiva, a lingam is placed in the middle with the other images around it. If he is a devotee of Suryanarayana, he has a sphatika as the central object of worship.

 

ఆదిశంకరులు ఈ భువిపై జీవించినది కేవలం 32 సంవత్సరాలే. అయినా ఎన్నో వేల సంవత్సరాలకు సరిపడా ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి అందించి చిరస్మరణీయులయ్యారు. ఒకవైపు బౌద్ధమత వ్యాప్తిమరొకవైపు శైవులువైష్ణవులు తాము గొప్పంటే తాము గొప్పని వాదించుకునే రోజుల్లో ఆదిశంకరులు ఈ నేలపై అవతరించారు. పుట్టింది కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో. ఆసేతు హిమాచలం మూడుసార్లు పర్యటించితన బోధలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. భారతదేశంలో శైవులువైష్ణవులతో పాటు శాక్తేయులుగాణాపత్యులుసూర్యోపాసకులు సైతం ఉండేవారు. వారు ప్రాంతాలవారీగా చీలిపోయి ఒకరిని ఒకరు దూషించుకుంటూకొట్లాడుకొంటూ కాలాన్ని వృథాపరచడం చూసి శంకరులు తీవ్రంగా వ్యధ చెందారు.

 

ఆ తరుణంలోనే శంకరాచార్యులు అద్వైతమతాన్ని స్థాపించారు. అహం బ్రహ్మాస్మితత్వమసి సిద్ధాంత భావజాలం వ్యాప్తిచేసితనలో ఉన్న దైవాన్ని ముందు దర్శించిఎదుటివారిలోనూ దైవాన్ని దర్శించి తరించమనే బోధతో పలువురిని ఆకట్టుకున్నారు. పరమశివుడుమహావిష్ణువు వేరు కాదు. వివిధ రూపాల్లో కనిపించినా ఇరువురూ ఒక్కరే అని చాటిచెప్పి, ‘శివాయ విష్ణు రూపాయశివరూపాయ విష్ణవే‘ అని ప్రబో ధించారు. అజ్ఞానాన్ని పారదోలి వివేకవంతులను చేశారు. సూర్యుణ్నిగణపతినిఅమ్మవారినిపరమశివుణ్నిమహావిష్ణువును ఆరాధ్యదేవతలుగాఇష్టదైవాలుగా నమ్మి పూజించే ఎవరినీ నిరాశపరచకుండాఏ దైవాన్నీ ద్వేషించకుండా అందర్నీ ఒక పీఠంపైనే కూర్చోబెట్టి పూజ చేయవచ్చని నచ్చజెప్పి పంచాయతన పూజను ప్రోత్సహించారు.

పంచాయతన పూజలో ఇష్టదైవాన్ని పీఠంపై మధ్య భాగాన ప్రతిష్ఠించి పూజిస్తారు. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు ప్రీతి అయినవారు విష్ణువును మధ్యలో ఉంచి మిగతా నాలుగు మూలలా అంబికనుపరమశివునిసూర్యనారాయణమూర్తినిగణపతిని ప్రతిష్ఠించిపూజించమని బోధించారు. శివుడు ఆరాధ్యదైవమైతే మధ్యలో శివుణ్నిఅలాగే గణపతిఅంబికసూర్యుణ్ని, శ్రీ మహావిష్ణువును ఉంచి పూజించవచ్చని తెలియజేసి అందర్నీ శాంతింపజేశారు. ఆదిశంకరులు దూరదృష్టితో ఈ పంచాయతన పూజను ప్రోత్సహించారు. ఏ దేవతను పూజించినా భక్తి ప్రధానమనినదులన్నీ చివరకు సాగరాన్ని చేరినట్లు మనం చేసే పూజలూ ఇష్టదైవానికే చెంది భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తాడని చెప్పి పలువురి కనులు తెరిపించి జగద్గురువులుగా ప్రసిద్దిచెందారు.

ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం చెప్పడమే కాకుండా పలు దేవతాస్తోత్రాలు రచించారు. తన వాక్చాతుర్యంతో మేధస్సుతోపెక్కుమంది పండితులతో వాదించి వారిని ఓడించి శిష్యులను చేసుకున్నారు. అద్వైత మతాన్ని దేశవ్యాప్తంచేసిహిందూ ధర్మాన్ని నిలబెట్టి భారతీయులకుఈ విశ్వానికి ఎనలేని సేవ చేశారు. దేశంలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరింపజేసిపూజాదికాలు సక్రమంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు. శివానందలహరిసౌందర్యలహరిభజగోవిందం వంటి మహద్గ్రంథాలను లోకాలకు అందించారు.

ఆది శంకరులు దూరదృష్టితో ఆలోచించి దేశం నలుమూలలా నాలుగు పీఠాలను ఏర్పాటు చేసిహిందూధర్మం శాశ్వతంగా నిలిచేటట్లు చేశారు. దేశంలో నాలుగు దిక్కులా- ఉత్తరాన హిమాలయాల దగ్గర బదరీనాథ్‌లోపశ్చిమాన ద్వారకలోతూర్పున పూరీజగన్నాథ్‌లోదక్షిణాదిన శృంగేరిలో పీఠాలు నెలకొల్పారు. తన ముఖ్య శిష్యులను పీఠాధిపతులు చేశారు. మానవాళి ధర్మపథంలో నడవడానికి మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఇది మానవాళి తరించడానికి ఆదిశంకరులు పెట్టిన భిక్ష!