Aadhyathmika Kendra Chennai
One stop solution for Divine Products
Sale!

Aadhyathmik Chabhang Roopu Mixed Metal Pendant 1inch 3grams Kshudra Sakthulanu Paradhroluthundhi Wards of Evil Spirits – S9058-113

555

Description

 

చబంగ్ రూపు

శివుని ఆయుధమైన త్రిశూలాన్నికి చబంగ్ అని మరో పవిత్రమైన నామం కలదు. డమరుకం పరమశివుని హస్తభూషణం. శివతాండవ నృత్యంలో బహుళ ఉపయోగంలోనిది. శివతాండవం చేస్తూన్నప్పుడు శంకరుడు ఢమరుకం మ్రోగించినప్పుడు సర్వబీజాక్షరాలు, సర్వాక్షరాలు వెలువడినవి. డమ్ డమ్ డ డమ్డమ్… డమ్ డమ్ డ డమ్డమ్ అనే డమరుక ధ్వణియైనా, డమరుక చిహ్నమైనా క్షుద్రశక్తులకు హడల్, ఆ పరిసరప్రాంతాల నుండి దూరంగా పారిపోతాయి.

దేవిభాగవతం సప్తమ స్కంధంలో త్రిశూలాన్ని త్రిమాతలకు మాతయైన రాజరాజేశ్వరీ దేవీ అమ్మవారు శివునకు బహుకరించినట్లు వర్ణించబడివుంది. ఈ త్రిశూలంతో శంకరుడు ఎందరో రాక్షసులను, లోక కంటకులను సంహారం గావించాడు. ఇంతటి మహిమాన్విత చిహ్నాలు పొదిగిన డమరుక త్రిశూల చబంగ్ రూపును సోమవారం కానీ, రాహు నక్షత్రాలైన ఆరుద్రా, స్వాతి, శతభిషా తారలున్న రోజున కాని సమీపంలోని ఆలయానికి తీసుకువెళ్ళి మీ స్వహస్తాలతో అర్చకులకు అందించి స్వామి పాదాలకు అమ్మవారి పాదాలకు తాకించి ఇవ్వమని కోరండి. ఆ సమయంలో మీకున్న బాధలన్ని తీరిపోవాలని మనస్సులో కోరుకుని అనంతరం ఈ రూపును ధరిస్తే చెప్పలేనంత లాభాలు తథ్యం.

శత్రుబాధ, పిశాచపీడ, దుఃఖము, నిద్రలో చెడు కలలు పోవడానికి ఈ చబంగ్ రూపును ధరించి “ఓం నమో భగవతే రుద్రాయ” అనే మంత్రాన్ని 108 మార్లు ప్రతి దినం జపిస్తూంటే చాలు.

విషపూరిత జీవుల నుండి రక్షణకై ఈ చబంగ్ రూపును ధరించి “ఓం నమో భగవతే నీలకంఠాయ” అనే మంత్రాన్ని 108 మార్లు ప్రతి దినం పఠించాలన్నది పురాణ వచనం. ముఖ్యంగా వ్యవసాయదారులు ధరించదగ్గ రూపు ఇది.

శంకరుడే ఐశ్వర్యేశ్వరుడు. ఐశ్వర్యేశ్వరుడే లక్ష్మికి, కుబేరుడికి సకల సంపదలను ఇచ్చి సన్మార్గంలో లోకకల్యాణార్థం ఉపయోగించమని ఆదేశించాడు. కనుక ఈ చబంగ్ రూపును ధరించి పంచాక్షరి మహామంత్రమైన “ఓం నమఃశ్శివాయ” ను 108 సార్లు పఠిస్తే ఋణబాధల నుండి విముక్తి లభించడమేగాక ఐశ్వర్యం కలుగుతుంది.