Aadhyathmika Kendra Chennai
One stop solution for Divine Products
Sale!

Aadhyathmik Balarama Halayudha Kavach 1.5inch 4Grams Brass Pendant – S9058-49

775

Description

హలాయుధ కవచం

విష్ణుమూర్తి దశావతారాల్లోని బలరాముడు, పూర్ణావతారమైన శ్రీకృష్ణుని వెన్నంటి ఉంటూ ఆ అవతార ప్రయోజనం సిద్ధించడానికి కృషిచేసాడు. చెరశాలలో ఉన్న దేవకి సప్తమగర్భాన్ని యముడు తన మాయ చేత ఆకర్షించి, రోహిణిదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. ఈ సందర్భంలోనే బలరాముడికి సంకర్షణుడు (సంపూర్తిగా ఆకర్షించినవాడు) అనే పేరు వచ్చింది. బలవంతులలోకి బలవంతుడు కనుక బలరాముడు అని పేరు. బలరామదేవుడు ఆదిశేషుని అవతారం. మహావిష్ణువు శ్వేతతేజస్సు బలరాముడుగాను, నీలతేజస్సు శ్రీకృష్ణుడుగాను అవతరించి దుష్టశిక్షణ చేసారు. బలరాముడు ఆనందము కలిగించువాడు, బలవంతుడు, భార్య రేవతీదేవి, హలము అంటే నాగలి ఆయుధం, ఎప్పుడూ నీలిరంగు వస్త్రాలనే ధరిస్తాడు, జెండా పైన తాటిచెట్టు గుర్తు ఉంటుంది.
నాగలితో దున్నిన భూమి నుంచి వచ్చిన ఆహారంతో సమస్త జీవరాసులనూ ఈ ప్రకృతి సాకుతోందన్న దానికి సంకేతం ఆయన ఆయుధం. కనుక ఈ హలాయుధ కవచాన్ని ఎవరు ధరిస్తారో వారు పది మందికి పెట్టే స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా రైతులు, పొలానికి కావాల్సిన వస్తువులతో వ్యాపారం చేసేవారు ఈ కవచాన్ని ధరించి బలరాముణ్ణి నిత్యం స్మరిస్తే లాభాలు కలుగుతాయి.
కాలసర్పదోషం, నాగశాపం, సర్పదోషం, రాహు లేక కేతు మహర్దశ అనుకూలించనివారు, రాహు-కేతు దోషాలున్నవారు ఈ కవచాన్ని ధరించడం శ్రేయోధాయకం.
బలహీనులు, సన్నగా ఉన్నవారు ఈ కవచాన్ని ధరించి బలరాముణ్ణి మనస్సులో స్మరించడం వలన బలవంతులౌతారు. ఆకర్షణీయంగా తయారౌతారు. రక్షణ రంగంలో ఉండేవారు, కుస్తి పోటీలలో పాల్గొనేవారు, బాడి బిల్డర్స్, వెయిట్ లిఫ్టర్లు తప్పక ఈ కవచాన్ని ధరించి తీరాల్సిందే.
ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లుండేవారు ఈ కవచాన్ని ధరించడంవలన వారి జీవితంలో ఆనందం కలుగుతుంది. ఆకర్షణశక్తి పెరుగుతుంది. రోగులు ఆరోగ్యవంతులౌతారు.
పఠించాల్సిన మంత్రం :- ఓం బలరామాయ నమః
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి